ఉన్నత విద్యకు’రత్నం ఫౌండేషన్’పదివేల చేయూత..
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: ట్రైనీ డీకన్ ప్రసన్న బాబుకు రత్నం ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. సోమవారం కర్నూలు నగరంలోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాస్ట్రేట్-2 నందు ట్రైనీ డీకన్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న బాబు వేదాంత విద్య (థియోలాజికల్ స్టడీ)కొరకు స్వర్గీయ పెరుమాళ్ళ రాజ రత్నం పేరు మీద స్థాపించబడిన”రత్నం ఫౌండేషన్”తరుపున 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రాజ రత్నం కుమారులు పెరుమాళ్ళ శ్రీనాథ్,డాక్టర్ శ్రీకాంత్ మరియు వారి మనవడు శ్రీశాంత్ నగదును అందజేశారు.ఈ ఆర్థిక సహాయాన్ని బిషప్ ఎమిరటస్ రైట్ రెవరెండ్ డా:పుష్ప లలిత చేతుల మీదుగా ప్రత్యేక ప్రార్థన చేసి అందజేశారు.ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న “రత్నం ఫౌండేషన్” సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డీనరీ చైర్మన్ రెవ యం.థియోడర్ జేకబ్ బాబు,ప్రెస్బిటర్లు రెవ సీహెచ్. రవి బాబు,రెవ యన్.థామస్ బాబు డయోసిస్ కౌన్సిల్ సభ్యులు సోలమన్ రాజ్,కె.జే. యేసుదాస్;పెరుమాళ్ళ పాల్ రీగన్ తదితరులు పాల్గొన్నారు.

