NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలో ..రైతులకు అందని ఎరువులు

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు ఎమ్మెల్యే విరపాక్షి మాట్లాడుతూ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు రైతులకు యూరియా, ఎరువులు అందని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పాడింది. రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రైతుకి ఎకరానికి ఒక్క బస్తా ఎరువు యూరియా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రతి రైతుకు 20 వేలు ఇస్తామని మోసం చేశారు. కేవలం 5 వేలు ఇచ్చారు అది‌కూడా రైతులకు అందడంలేదు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి  హయాంలో రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా అందించాము. రైతులకు మేలు చేసింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఒక్కరే, టీడీపీ  నేతలు చెపితేనే యూరియా బస్తాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం 1లక్ష కోట్ల అప్పులు తెచ్చారు.‌ఎవరికి ఇచ్చారో చెప్పాలి, ఆడ బిడ్డ నిధిని ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అమ్మాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 50 ఏళ్ళకే ఫించన్ అందిస్తామని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. సూపర్ సిక్స్ పథకాలను అన్ని ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. కేవలం ప్యాకెజీకి పరిమితం అయ్యారు. సింగపూర్ లో దాచుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రులు పర్యటించారు. అమరావతి అభివృద్ధి కూడా ఏమి చేయలేదు. ఒక్క ఇటుక వేయడం లేదు, రైతులకు ఇప్పటికైనా  యూరియా అందించాలినీ తెలియజేశారు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి   రాష్ట్ర కమిటి సభ్యులు కర్నూల్ జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసిలు, మండల కన్వీనర్లు, ఎంపీపీ లు,పార్ట్ అనుబంధ విభాగాల సభ్యులు,  సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్​ఆర్​సిపి నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author