ఆదోని రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కు వినతి
1 min read

SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ నాయకులు
హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున హొళగుంద నుండి డాణ పురం రోడ్డు సమస్యపై ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చినానంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పందిస్తూ ఈ సమస్యను పై అధికారుల దృష్టకి తీసుకుపోతామని మరియు ఒక వారంలోపల హోలగుందకు విజిట్ చేస్తానన్నారని తెలియజేశారు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఎస్ డి పి ఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు సమావేశంలో వారు మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల నుండి డాణాపురం నుండి హొళగుంద కు వేళ్ళ ప్రధాన రహదారి చాలా అధ్వానంగా మారిందన్నారు గత 20 సంవత్సరాలు నుండి ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన సమస్య పరిష్కారం కావడం లేదు ఏ రాజకీయ నాయకులు మారిన సమస్య పరిష్కారం కావడం లేదు హొళగుంద మండలంతో పాటు దాదాపు 35 నుంచి 40 గ్రామాల ప్రజలు రోజు వారిగా ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు ఆరోగ్య నిమిత్తం గాని ప్రధమ చికిత్స కోసం గాని విద్యార్థులు చదువుకోవడానికి గాని రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి గాని వ్యాపారస్తులు సరుకులు కొనుగోలు కోసం గాని ప్రతి చిన్న విషయానికి రోజువారీగా ఆదోనికి వెళ్లడం సహజంగా మారింది అని అన్నారు. ఈ రోడ్డు సమస్య వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది హొళగుంద ప్రాథమిక పాఠశాలలో దాదాపు 2000 మంది విద్యార్థులు ఉన్నా సరే ప్రభుత్వ టీచర్లు హొళగుంద రావడానికి ఆసక్తి చూపడం లేదన్నారు ఇది ఇలా ఉంటే ఆరోగ్యపరంగా చూస్తే కొన్నిసార్లు డెలివరీ పేషెంట్లను డాక్టర్లు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చిన సమయానికి వెళ్లలేకపోతున్నారు కొన్నిసార్లు ఎమర్జెన్సీ పేషెంట్లను హాస్పిటల్ కి తీసుకుపోవాలంటే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయే సమయాలు కూడా ఉన్నాయి అని అన్నారు ఈ సమస్యను ఉన్నత అధికారుల మరియు రాజకీయ నాయకులకు తెలియపరచడానికి హొళగుంద ప్రజలు జేఏసి గా ఏర్పడి వినతి పత్రాలు నిరసనలు చేసిన సరే ఎటువంటి ఫలితం రాలేదన్నారు టీడీపీ ప్రభుత్వమైన స్పందిస్తూరోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున డిమాండ్ చేశారు మరియు నాయకులు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారం కాకపోతే అన్ని పార్టీలు కలిసి ప్రజాసంఘాలు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసి దాణాపురం హైవే బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్ ఉపాధ్యక్షులు కొలిమి సలాం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ కోశాధికారి అల్లా ప్రకాష్ కార్యవర్గ సభ్యులు అస్లాం షఫీ చికెన్ బక్షి రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.


