అర్హులకు ఇళ్ల పట్టాలు అందించాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆయన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాల విషయంపై చర్చించారు. అమీర్ హైదర్ ఖాన్ నగర్, కారల్మార్క్స్ నగర్, బుధవారం పేట, జగన్నాథ గట్టుపై టిడ్కో ఇళ్లతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇళ్ల పట్టాలు లేనిచో వారికి పట్టాలు ఇచ్చే విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కర్నూల్లో ఇళ్ల పట్టాల సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్ గురించి ఆరా తీశారు ఖాళీగా ఉన్న వాటిని ఇతరులు ఆక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, కర్నూల్ రూరల్ ఎమ్మార్వో రమేష్ బాబు, అర్బన్ ఎమ్మార్వో రవికుమార్, కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

