NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆక్యుపంక్చర్ తో ఉపాధి..

1 min read

ప్రభుత్వ సంస్థ  ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ తో ఇండియన్ ఓమ్ ఒప్పందం.

విజయవాడ, న్యూస్​ నేడు:  కానూరు అశోక్ నగర్ లోని ఇండియన్ ఓమ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ సంస్థ ప్రభుత్వ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ యువతకు ఆక్యూపంక్చర్ర్లో శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి అభివృద్ధికి ఏ పి ఖాది బోర్డు  సి ఏ ఓ  ఎన్. రవికుమార్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఇండియన్  ఓమ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ‘యోగాంధ్ర ఆక్యూపంక్చర్ ఆక్యుప్రెషర్ మల్టీ థెరపీ సర్వీస్ సెంటర్స్ అభివృద్ధికి’ ఇరువురు కలిసి పని చేయవలసి ఉంటుంది.దీని ద్వారా రాష్ట్రంలో ఉపాధి- ఆరోగ్యం పెంపొందుతాయని ఆక్యూపంక్చర్ ను భారతదేశంలో గుర్తింపు కోసం పని చేసిన డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టు వల్ల కనీస విద్యార్హత పదవ తరగతి చదివిన యువత శిక్షణ పూర్తి చేసి ధృవీకరణ పత్రాలను ఇండియన్ ఓమ్ ద్వారా ప్రభుత్వ నుంచి పొందవలసి ఉంటుంది.వీరు ఆక్యూపంక్చర్ మల్టీ తెరపి సెంటర్లు ఏర్పాటు -నిర్వహణ కు శిక్షణ మరియు గైడెన్స్ ను ఇండియన్ ఓమ్ అందించే లాగా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.పథకంలో సభ్యులుగా చేరగోరు వారు స్వయంగా గాని,లేదా సెల్ 9000347369 కు సంప్రదించవలచింది గ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.

About Author