నందికొట్కూర్ లో భారీగా ట్రాక్టర్ ర్యాలీ..
1 min read

రైతుల కళ్ళల్లో ఆనందం-నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు , న్యూస్ నేడు : అన్నదాత సుఖీభవ నగదు రావడంతో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో “అన్నదాత సుఖీభవ పథకం” కింద కేంద్ర ప్రభుత్వం 2వేలు, రాష్ట్ర ప్రభుత్వం 5వేలు కలిపి మొత్తం 7వేలు రైతుల అకౌంట్ల లో జమ అయినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా నందికొట్కూరు పట్టణంలో ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి,డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి తదితర నాయకులు రైతులు భారీగా పాల్గొన్నారు. ముందుగా ఆత్మకూరు రహదారిలో ఉన్న జమ్మి చెట్టు నుండి మార్కెట్ యార్డ్ వరకు ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీ విజయవంతం అయింది. మార్కెట్ యార్డులో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ రైతుల సంక్షేమ అభివృద్ధిని కోరుకుంటుందని చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందని అన్నారు.అంతే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుందని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు యాదవ్,మండల కన్వీనర్లు ఖాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి,జాకీర్ హుస్సేన్, జమీల్,వంగాల శివరామిరెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

