NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విలేకరినంటూ ఎర్రచందనం స్మగ్లింగ్

1 min read

మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడుగా చలామణి

వైఎస్ఆర్సిపి కమలాపురం సోషల్ మీడియా వింగ్

మండల టిడిపి నాయకులు ఆటో బాబు

చెన్నూరు , న్యూస్ నేడు : వైయస్సార్సీపి కమలాపురం సోషల్ మీడియా వింగ్ అయినటువంటి మిట్టా మాధవరెడ్డి అను వ్యక్తి నేను సాక్షి విలేకరిని అని చెప్పుకుంటూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెంట తిరుగుతూ, ఆయన ముఖ్య అనుచరుడి గా చలామణి అవుతూ, మోస్ట్ వాంటెడ్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన మిట్టా మాధవరెడ్డి సాక్షి పత్రిక విలేఖరి ముసుగులో అతను చేసిన దందాలు, అతను పాల్పడిన బ్లాక్ మెయిల్ లు అంతా ఇంతా కాదని అతని జీవితమంతా కూడా నేరమయమేనని టిడిపి బిసి నాయకులు ఆటో బాబు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెన్నూరు లోని బుడ్డాయ పల్లి గ్రామానికి చెందిన మిట్టా మాధవరెడ్డి నేను నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి  నంటూ అతను సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు క్రియేట్ చేసుకుని అందులో తనకు ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెట్టుకుంటూ తన దందాలను యదేచ్ఛగా కొనసాగించారని తెలిపారు. అంతేకాకుండా  డబ్బున్న నాయకులను అలాగే ధనికులను టార్గెట్ చేసుకొని వారి వ్యక్తిగత కార్యకలాపాలపై దృష్టి పెట్టి వారిని బ్లాక్ మెయిల్ కు గురిచేస్తూ వారిని వ్యక్తిగతంగా భయపడిస్తూ  డబ్బులు డిమాండ్ చేస్తాడని తెలిపారు. వారు డబ్బులు ఇవ్వకుంటే తన సోషల్ మీడియాలో వారిపై అసత్యంగా, అసభ్యకరంగా పోస్టులు పెడుతూ ఉండేవాడని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలోనే మిట్టా మాధవరెడ్డిని మంగళవారం అటవీ శాఖ అధికారులు వారికి అందిన సమాచారం మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడిన మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లీ చేస్తూ పట్టుబడ్డ మిట్టా మాధవరెడ్డి నేర చరిత్ర కలిగినవాడని, ఎప్పుడు క్రిమినల్ ఆలోచనలే తప్ప మరే ఇతర ఆలోచన లేదని  ఆయన తెలిపారు. పోలీస్ అధికారులు నాకు బాగా తెలుసని నేను ఎలా చెబితే వారు అలా వింటారు అని చెబుతూ కొద్దిరోజులు ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే ఆయన కొన్ని పంచాయితీలు కూడా చేయడం జరిగిందని ఒక పోలీస్ అధికారితో కూడా అతను ఎంతో సఖ్యతగా ఉన్నాడని కొంతమంది ప్రజలు అప్పట్లో గుసగుసలాడుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఆ సఖ్యతను అలుసుగా తీసుకున్న మిట్టా మాధవరెడ్డి ఇంకా రెచ్చిపోయారని ఇంకా యదేచ్ఛగా తన మోసాలను కొనసాగించారని ఆయన తెలిపారు.అదేవిధంగా మిట్టా మాధవరెడ్డి బయట ప్రాంతాలలో సెటిల్మెంట్లకు వెళ్లి దౌర్జన్యాలు చేస్తూ ఉండేవాడని, కమలాపురం నియోజకవర్గ పరిధిలో చాలామందిని అతను మోసం చేశాడని ఆయన తెలిపారు. అలాంటివాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉండి మాజీ ఎమ్మెల్యే వెంట తిరుగుతూ, వైఎస్ఆర్సిపి కమలాపురం సోషల్ మీడియా వింగ్ గా పనిచేస్తూ, అలాగే నేను సాక్షి విలేకరిని అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడని ఆయన మాధవ రెడ్డి చేసిన అవినీతి పనులపై ధ్వజమెత్తారు. ఇవే కాకుండా అతను చేసిన మోసాలు ఇంకా ఎన్నో ఉన్నాయని, ఏది ఏమైనా అతనిని అధికారులు పూర్తిస్థాయిలో విచారించి అతనికి తగిన శిక్ష అదే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా మిట్ట మాధవరెడ్డి చేసినటువంటి పాపాలన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అతనికి శిక్ష పడడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంత చేస్తున్న ఏ రోజు కూడా అటు వైయస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అతను చేస్తున్న పనులకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు కల్లూరు ఓబుల్ రెడ్డి, పాలగిరి రమణారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి (టైగర్ బ్రదర్స్) తదితరులు పాల్గొన్నారు.

About Author