NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

15 న స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

1 min read

కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆగస్టు 15 న స్త్రీ శక్తి పథకాన్ని  ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆర్టీసీ అధికారులు, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్ లను ఆదేశించారు.బుధవారం స్త్రీ శక్తి పథకం ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆర్టీసీ అధికారులు, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15 వ తేదీన సాయంత్రం అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో స్త్రీ శక్తి పథకం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు..ఆ మేరకు కలెక్టర్  ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడారు.. టెలి కాన్ఫరెన్స్ లో ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, సబ్ కలెక్టర్, ఆర్డీవో లు, ఇతర నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

About Author