చెరువుకు రింగ్ బండ్ వేయించేందుకు చర్యలు..
1 min read

మద్దిగుండం చెరువు గండికి త్వరలో పనులు
40 లక్షలతో ప్రతిపాదనలు
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : జలకనూరు మద్దిగుండం చెరువుకు త్వరలో రింగ్ బండ్ వేయించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు మద్దిగుండం చెరువు కట్ట తెగిన సంగతి తెలిసిందే.గురువారం ఉదయం ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు.మరమ్మతుల కోసం 40 లక్షలతో ప్రతిపాదనలు పంపించామనితెగిన కట్ట దగ్గర వేయుటకు 30 వేల ఇసుక సంచులు అవసరం ఉందని వర్షం తగ్గిన తర్వాత వాటిని వేయిస్తామని గత ప్రభుత్వం ఈ రిజర్వాయర్ ను పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు బాధపడాల్సి వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ రోడ్డు ఆరిన వెంటనే సత్వరమే పనులు పూర్తి చేసి 20వేల ఎకరాల నష్టం జరిగింది నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్,ఇరిగేషన్ అధికారులు, మంత్రితో నిధుల మంజూరు గురించి మాట్లాడడం జరిగింది. పనులు పూర్తి చేసిఈ రిజర్వాయర్ లో నిల్వ ఉంచి పంటలకు నీరు అందిస్తామని అంతేకాకుండా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ టి. సుబ్రహ్మణ్యం,కాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు,ఎస్ఐ తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

