NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదలకు 3 సెంట్ల ఉచిత ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోండి…

1 min read

ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం….

ఈ బి సి కాలనీలో విస్తృతంగా పర్యటించిన తెదేపా నాయకులు…

హొళగుంద న్యూస్ నేడు  : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఇందులో భాగంగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఉచితంగా మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తుందని అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోవాలని తెదేపా మండల కన్వీనర్ వీరన్న గౌడ్, తెదేపా నాయకులు డిఎస్ భాష, అబ్దుల్ సుబాన్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఈ బి సి కాలనీ నందు తెదేపా నాయకులు కార్యకర్తలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి  ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తుందని అన్నారు. ఉచిత ఇంటి స్థలాలతో పాటు ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తోందని, అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిలాన్, సిబిఎన్ ఆర్మీ మోయిన్, వలి, శాలి అమాన్, శాలి మోయిన్,సుభాన్, ఆరిఫ్, అల్తాఫ్, చిన్నహ్యాట సర్పంచ్ హేసన్ తదితరులు పాల్గొన్నారు.

About Author