ఉత్తమ అవార్డు అందుకున్న సీఐ సుబ్రహ్మణ్యం..
1 min read

ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మాధురి..ఎస్భీ ఈశ్వర్ కు అవార్డ్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు భవనాలు,పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జార్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమ విధుల్లో మంచి ప్రతిభ కనబరిచిన అధికారులకు మంత్రి ఉత్తమ ప్రశంసా పత్రాలు అందజేశారు. నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం మరియు బ్రాహ్మణకొట్కూరు,మిడుతూరు పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పి ఈశ్వర్ మంత్రి మరియు నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా,జిల్లా కలెక్టర్ జి రాజకుమారి చేతుల మీదుగా ఉత్తమ అధికారులుగా అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా నందికొట్కూరుఆర్డబ్ల్యూఎస్ ఏఈలు నందికొట్కూరు-వేణుమాధురి, పాములపాడు-సువర్చల, నందికొట్కూరు గృహ నిర్మాణ శాఖ ఏఈ అరుణ్,తహసిల్దార్ కార్యాలయం నుండి జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి,బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ నూర్ అహ్మద్,నందికొట్కూరు పీఎస్ నుండి సునీల్,ముచ్చుమర్రి పి ఎస్ కే.అమర్ కానిస్టేబుళ్లు ఉత్తమ అవార్డులు అందుకున్నారు.ఉత్తమ అవార్డులు అందుకున్నందుకు గాను ఆయా శాఖల అధికారులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.



