పీజిఆర్ఎస్ అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
1 min read

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి..
నంద్యాల , న్యూస్ నేడు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నంద్యాలజిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్,డీఆర్ఓ రాము నాయక్,ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలు జిల్లా నలుమూలల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పిజిఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారని అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇవ్వాలన్నారు.అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఎస్.పెద్ద శేఖర్ తనకు సొంత ఇల్లులేదని ప్రస్తుతం బాడుగ ఇంటిలో ఉన్నామని నాకు ఇంటి స్థలం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పి.మద్దయ్య సర్వే నెంబర్ 81/65లో ఎకరా భూమి తన పేరు మీద ఉంది. ఈ భూమిని రీసర్వ్ చేయగా రీ సర్వేలో ఎకరా కంటే తక్కువగా చూపిస్తూ హద్దులు నాటారు కావున తన భూమి తనకు ఖచ్చితమైన హద్దులు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గడివేముల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసులు తనకు వస్తున్న వికలాంగుల పెన్షన్ ను తొలగించడం జరిగిందని తిరిగి తనకి పెన్షన్ పునరుద్ధరించాలని కలెక్టర్ కు అర్జీ సమర్పించారు.సమస్యల గురించి ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

