ప్రైవేట్ హాస్పిటల్స్ లలో వైద్య విద్య అర్హత ఉన్నవారినే తీసుకోవాలి
1 min read

సబ్ కలెక్టర్ మౌర్య భారత్వాజ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
నర్సెస్ & నర్సింగ్ విద్యార్థి నాయకుడు ఖాజా మొయినుద్దీన్.
ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య విద్య అర్హత లేనివారితో వైద్య సేవలు అందిస్తున్న వైనం.
కర్నూలు, న్యూస్ నేడు: ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ – నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆదోని డివిజన్ అధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్ సబ్ కలెక్టర్ మౌర్య భారత్వాజ్ కి వినతి పత్రం ఇవ్వగా తక్షణమే సబ్ కలెక్టర్ స్పందిస్తూ వెంటనే డిఎంహెచ్వో ని తనిఖీలు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థి నాయకుడు ఖాజా మొయినుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆదోని డివిజన్లో లోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కచ్చితంగా నర్సింగ్ స్టాఫ్స్ ను వైద్యా విద్య అర్హత ఉన్నవారినే తీసుకోవాలని చాలా హాస్పిటల్స్ లో యాజమాన్యం లాభం కోసం అరహులు కానీ ఇంటర్మీడియట్, పదవ తరగతి డిగ్రీ పాసైన,అర్హులు కాని వారితో 6,7,8 వెలు, జీతాలు ఇచ్చి అలాగే నర్సింగ్ పూర్తి కానటువంటి విద్యార్థులతో వైద్య సేవలకు ఉపయోగించుకుంటున్నారూ. మరియు అర్హత ఉన్నవారిని కూడా చాలిచాలని జీతాలు ఇచ్చి పని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఇంకా చదివిన వారికి చదవని వారికి విలువ ఒకటేనా..?కనీసం అవగాహన లేకుండ ఉంటే ఎలా..?ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ సెక్రెటరీ ముజీబ్ భాష, జాయింట్ సెక్రెటరీ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

