సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
1 min read

అన్ని విధాలుగా నేను మీకు నిత్యం అండగా ఉంటా
ఏలూరు, న్యూస్ నేడు : ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరుజిల్లా ప్రతినిధి:పేదల ఆరోగ్య భద్రతకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్నామనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక తోడ్పాటు అందిస్తున్నామనీ స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడి ఎమ్మెల్యే వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకునీ, ఆయా ససమస్యలకు పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఐదుగురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 8లక్షల, 37వేల, 707 రూపాయల విలువైన చెక్కులను అందించారు. కూటమి పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. అన్నివిధాలా నేను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి బాసటగా నిలవడంతో పాటూ, నేనున్నానని ధైర్యం కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామనీ చెప్పారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ వైద్యసేవలతో పాటూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక తోడ్పాటు కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

