NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గత ఆరు నెలల్లో పిల్లల్లో పోషక లోపాలు తగ్గాయి..మంత్రి

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖలు మరియు గిరిజన సంక్షేమ శాఖ కమిటీలు చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 6 ఐసిడీఎస్​ ప్రాజెక్టుల పరిధిలో 1663 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా, వీటిలో 1620 ప్రధాన, 43 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. 2 వర్కర్లు, 2 మినీ వర్కర్లు, 40 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలన్నారు.బాలసంజీవని పోషణ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. గర్భిణీలు, బాలింతలు, 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా గుడ్లు, పాలు, మల్టిగ్రేన్ పిండి తదితర పోషకాహారం అందిస్తున్నారు. పధకాల ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులు ఉపయోగం పొందారు.గత ఆరో నెలల్లో పిల్లల్లో పోషక లోపాలు తగ్గాయని మంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.జిల్లాలోని 101 సాక్షం అంగన్వాడీల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. (పోషణ వటికాలు, వాటర్ ఫిల్టర్లు, ఎల్​ఈడి స్క్రీన్లు).2024లో ఏర్పడిన శిశు సంరక్షణ యూనిట్ ద్వారా ఈ ఏడాది 157 మంది పిల్లలు రక్షించబడ్డారు, బాల్య వివాహాలు, POCSO, బాల కార్మికత కేసుల్లో చర్యలు తీసుకున్నామని వివరించారు.సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా బాధిత మహిళలకు న్యాయ, వైద్య, కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నారు. త్వరలో స్వంత భవన నిర్మాణం ప్రారంభమవుతుంది.“మహిళలు, పిల్లల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆధునిక వసతులతో అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నాం. మహిళల రక్షణకు, మర్యాదకు కట్టుబడి పని చేస్తున్నాం”– మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.

About Author