యూరియా పంపిణీ పై జిల్లా కలెక్టర్ సమీక్ష
1 min read

యూరియా పంపిణీ లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : యూరియా పంపిణీ లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో యూరియా ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి యూరియా పంపిణీ పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా అక్రమంగా మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు అమ్మినా, లింకేజీలు పెట్టినా కేసులు నమోదు చేయాలని కలెక్టర్ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. బార్డర్ చెక్ పోస్టుల్లో విజిలెన్స్, పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీములను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నానో యూరియా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.. ప్రస్తుతం వచ్చిన యూరియాను ఏ ఏ మండలాల్లో అవసరం ఉందో ఆ మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, తదుపరి సహకార పరపతి సంఘాల్లో ఉంచాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.ముందుగానే టోకెన్ లు పంపిణీ చేసిన విషయం ప్రస్తావిస్తూ, వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ లో పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, అగ్రికల్చర్ జెడి వరలక్ష్మి, రాజు డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్కెటింగ్, డిఎస్ఓ రాజా రఘువీర్, డిటిసి శాంత కుమారి, డిడి ఫిషరీస్ రంగనాథ్ బాబు, డిఎం సివిల్ సప్లైస్ వెంకట రాముడు , ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్లు, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.


