హెల్మెట్ తప్పనిసరి…సీఐ
1 min read

ఓర్వకల్లు, న్యూస్ నేడు : ద్విచక్ర వాహనా దారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబు నాయుడు,ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం టోల్ ప్లాజా వద్ద కర్నూలు నుండి నంద్యాలకు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాదారులకు చలానా విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాధారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనను పాటించాలని తెలిపారు. ఇప్పుడు చట్టాలు కఠినంగా ఉన్నాయని మద్యం సేవించి వాహనాలు నడప రాదని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరుకుతే రూ.10వేలు రూపాయలు జరిమానా జైలు శిక్ష ఉంటుందని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే 1500 రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. వాహనాల తనిఖీలో ఏఎస్ఐ పాండురంగ స్వామి హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్ పాల్గొన్నారు.

