ఆరుగురు చిన్నారులు మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని చిగిలిలో నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందడంపై రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

