ఎస్సీ .. ఎస్టీ చట్టం పై అవగాహన సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి. కబర్థి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీలా వెంకట శేషాద్రి గారి సూచనల మేరకు బి. క్యాంపు నందు గల ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రధాన అధ్యాపకుడు డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారి అధ్యక్షతన పి.సి.ఆర్ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లపై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ సులోచన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ఎస్సీ ,ఎస్టీల హక్కులను కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ ,ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు .లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ కళాశాలలో అందరూ కలిసిమెలిసి ఉండాలని కులం పేరుతో దూషించడం అలాంటివి చేయరాదని సూచించారు. అనంతరం గవర్నమెంట్ విశ్రాంత ఉద్యోగుల సంఘము జిల్లా ప్రెసిడెంట్ మురళి శంకరప్ప ఎస్సి /ఎస్టీ యాక్ట్ ఉపయోగించు కొని తమను ఎలా కాపాడు కోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రామకృష్ణ,విజయశేఖర్, సోమేశ్, జబీన్ అక్తర్, ఉల్గోజిరావు, చిన్న మల్లేశ్వరుడు, శ్రీధర్ తదితరులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పైన అవగాహన కల్పించారు.

