సర్టిఫికెట్ల పరిశీలన బృందాలు అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి
1 min read

జిల్లా విద్యాశాఖాధికారి …
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లావ్యాప్తంగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో భాగంగా నియమించిన మండల విద్యాధికారులకు ప్రధానోపాధ్యాయులకుడిప్యూటీ తహసీల్దారులకు డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కూడిన బృందాలకు మధ్యాహ్నం 3.30లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కర్నూలు కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న సునయన ఆడిటోరియం నందు జరిగింది.ఈ శిక్షణలో విద్యాశాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు అబ్రహం, ప్రాంతీయ సంచాలకులు కే. శామ్యూల్ ఆన్లైన్లో హాజరై డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా ఏ అంశాలపై ఎలా క్షుణ్ణంగా పరిశీలించాలనే అంశాలపై అధికారులు వివరించారు. ఏ చిన్న అవాంతరం జరగకుండా విద్యాశాఖ సూచించిన నిబంధనల మేరకు విధివిధానాలు అమలు చేయాలని ఇది విధానాలకు భిన్నంగా సర్టిఫికెట్ల పరిశీలన జరగడానికి వీల్లేదని ఆదేశించారు. సర్టిఫికెట్ల పరిశీలన బృందాలు అత్యంత జాగ్రత్తగా ధ్రువపత్రాలను పరిశీలించాలని ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులను సంప్రదించాలని కోరారు. సమావేశంలో కర్నూలు జిల్లా యస్. శ్యామ్యూల్ పాల్ నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ సంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు హాజరై సూచనలు ఇచ్చారు.


