మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
1 min read

: ఎస్ అన్వర్ భాష
ప్యాపిలి, న్యూస్ నేడు: మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని ప్రధానోపాధ్యాయులు ఎస్. అన్వర్ భాష అన్నారు. ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలంలోని హుసేనాపురం ఉన్నత పాఠశాల భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్, స్కౌట్ మాస్టర్ బి చంద్రమౌళి ఆధ్వర్యంలో స్కౌట్ మరియు గైడ్స్ విద్యార్థులు తయారుచేసిన మట్టి వినాయక విగ్రహాలు ప్రదర్శించి, వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్సేనాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ అన్వర్ భాష మాట్లాడుతూ వినాయక చవితి పండుగ రోజున కృత్రిమ రసాయనాలతో తయారైన వినాయక విగ్రహాలను కాకుండా సహజ సిద్దంగా లభించే మట్టితో తయారైన విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కృత్రిమ రంగుల తో తయారైన విగ్రహాలను నీటి కుంటలు మరియు చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల జలచరాలు మరియు పశువులకు హాని కలుగుతుందని ఆయన తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


