జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు ను ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మంగళవారం ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. సునిశితంగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు – పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాంఅన్నారు.అనంతరంవిద్యార్థులకు బహుమతులు ప్రకటించారు.ప్రథమ బహుమతి,,రేఖమ్మ, హిమబిందు,ద్వితీయ బహుమతి,రమ్య, సానియా, మానస,తృతీయ బహుమతి,స్వాతి, లహరి, లక్ష్మి,కన్సలేషన్ బహుమతి,రుక్సానా, అంజూమ్ లకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పిఓ నవీన పాటి,అధ్యాపకులు :రామకృష్ణయ్య ,వెంకటరమణ ,ఓబులేసు, మద్దిలేటి,వెంకటేశ్వర్లు,శంకరయ్య ,మురళి మోహన్ గౌడ్,ముస్తాక్, మంజునాథ్ , వన్నూర్ ,సురేష్ మరియు ఎన్ఎస్ ఎస్ వాలంటీర్స్ రమ్య, సానియా, రేఖమ్మ, శ్రావణి జ్యోతి, రాఫాత్ సుల్తానా, రోహిత్, లక్ష్మి రంగయ్య, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


