NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దశబుజ శ్రీ లక్ష్మీ గణపతి ప్రథమ వార్షికోత్సవం

1 min read

నాలుగు రోజులపాటు కార్యక్రమాలు

పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు

నగర ప్రజలకు,భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు

ఆలయ చైర్మన్ సిరికి శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు జిల్లా  దొండపాడు  దత్తశ్రమం ఆదర్శనగర్ రోడ్ నెంబర్ 2 లో గల శ్రీ  గణేష్ సాయి సదన్ వద్ద శ్రీ లక్ష్మ గణపతి దశబుజ ఆలయం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పది చేతులగల (దశభుజలక్ష్మీ గణపతి) ని నగరంలోని పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని,మొక్కులు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.సిరికి శ్రీనివాస్,దశ సంధ్య దంపతులకు  స్వప్నంలో దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మించవలసినదిగా కోరినట్లు తెలియజేశారు. 2024 ఆగస్టు 18 వ తారీఖున మహాబలిపురంలో ఐదు అడుగుల విగ్రహాన్ని తయారు చేయించి తీసుకు వచ్చి వేదమంత్రాలుతో  ప్రతిష్టించినట్టు  తెలిపారు. నాటి నుండి నేటి వరకు వేలాదిగా భక్తులు విచ్చేసి దశ భుజ లక్ష్మి గణపతి  ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మి గణనాధుని దర్శించుకుంటే చింతలు తొలగి, తాము కోరిన కోర్కెలు నెరవేరతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో  విరాజల్లుతారని అన్నారు. మొదటిరోజు కలశ స్థాపన,2,3 వ రోజులు విశేష పూజలు,4వ రోజు అష్టోత్తర అర్చన కార్యక్రమాలు అనంతరం హోమం జరుగుతాయి అన్నారు. కావున భక్తులందరూ విచ్చేసి దశ బుజ లక్ష్మీ గణపతిని సేవించి తరించవలసిందిగా, ఏలూరు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఆలయ చైర్మన్ సిరికి శ్రీనివాస్ తెలియజేశారు.

About Author