NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగుల ఉపాధి ఉద్యోగ భద్రత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

1 min read

ఎల్ ఎల్ సి, డి సి, చైర్మన్, మిక్కిలినేని వెంకట శివప్రసాద్

హొళగుంద న్యూస్ నేడు:   మండల కేంద్రంలో, ఎల్ ఎల్ సి, డి సి చైర్మన్, మిక్కిలినేని వెంకట శివప్రసాద్ వారు మాట్లాడుతూ, విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ద్వారా దేశంలోనే విద్యారంగాన్ని అగ్రస్థానంలో నిలబడతామని, ఎల్ ఎల్ సి, డిసి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్, అన్నారు,  కూటమి ప్రభుత్వం, ఎన్నికల్లో  యువత కు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ డబ్ల్యూఎస్, దివ్యాంగా అభ్యర్థులకు వయోపరిమితిని సడలించి వారికి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు ఉంటేనే విద్యారంగం ముందుకు వెళుతుందని నమ్మిన మంత్రి లోకేష్ ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ విద్యలో విద్యా,ప్రమాణాలు,పెంపొందించేందుకు ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలకు నూతన వెలుగులు తెస్తున్న లోకేష్ కృషి ని కొనియాడారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన హయాంలో 13 డిఎస్సీలు నిర్వహించి 1.802 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులకు తోడు, ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ 2014-19 మధ్య కాలంలో టిడిపి ప్రభుత్వం రెండు డీఎస్సీ లు నిర్వహించి 18 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన సంగతిని ఈ సందర్భంగా, ఎల్ ఎల్ సి, డి సి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్, గుర్తు చేశారు,. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అధిక శాతం చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు పొందిన వారేనని, మిక్కిలినేని వెంకట శివప్రసాద్, వివరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందంజలో ఉందన్న విషయం గణాంకాలు పరిశీలిస్తే వెళ్లడవుతుందన్నారు. అలాగే,ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీను ఆపేందుకు కోర్టుల్లో 24 కేసులు వేయించారని అవన్నీ తట్టుకొని డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందన్నారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చివరి వరకు సాగదీసి 2024 ఎన్నికలకు ముందు 6100 పోస్టులకు డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేశారని జగన్ వైఖరి పై  ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం, యువత బాగుపడటం జగన్మోహన్ రెడ్డికి సుతరాము ఇష్టం లేదని విమర్శించారు.. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి,చంద్రబాబునాయుడు కి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని మిక్కిలినేని వెంకట శివప్రసాద్ అన్నారు.

About Author