ఘనంగా 19వ శ్రీ గణేశ పూజ మహోత్సవాలు
1 min read

విజయవాడ , న్యూస్ నేడు : కమిటీ సభ్యులు ఈ సందర్భంగా జొన్నలగడ్డ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రాంతం సంవత్సరం నుండి శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవ కమిటీగా ఏర్పడి గణేష్ మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని అదే విధంగా ఈ సంవత్సరం కూడా 19వ శ్రీ గణేష్ మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా 27వ తేదీ నుండి 31 వ తేదీ వరకు శ్రీ గణేష్ పూజ మహోత్సవంలో జరుగుతున్నాయని తెలిపారు ఆగస్టు 31వ తేదీన ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం సుమారు 5000 మందికి నిర్వహిస్తున్నామని ఆ తర్వాత శ్రీ వినాయకుని 80 కేజీల లడ్డు వేలం పాట నిర్వహిస్తున్నామని వేలంపాట అయిపోయిన వెంటనే శ్రీ వరసిద్ధి వినాయకుని మేళ తాళాలతో ఊరేగించి నిమజ్జన కార్యక్రమం చేస్తామని తెలిపారు భక్తులు శ్రీ గణేష్ పూజ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వినాయకుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు శ్రీ గణేష్ మండపము ఏర్పాటుకు మహోత్సవములు నిర్వహించేందుకు పోలీస్ శాఖ వారు సింగిల్ విండోస్ పద్ధతి ప్రకారం ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చి మాకు ఎంతో సహకరించారని ఈ ఆన్లైన్ పద్ధతి వలన సింగిల్ విండో ద్వారా చాలా సులభంగా పర్మిషన్లు పోలీస్ శాఖ నుండి లభించాయని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నుండి కూడా అన్ని పర్మిషన్లు లభించాయని అందువలన సిటీ కమిషనర్ కి పోలీస్ శాఖ కి మున్సిపల్ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సత్యనారాయణ, నందం శ్రీనివాస రావు బొమ్మనబోయిన శ్రీ రామచంద్రుడు కొత్తపల్లి హరిబాబు , అల్లూరి నాగార్జున ,విశ్వం శెట్టి అఖిల్ , ఆలపాటి గణేష్ కుమార్ కొల్లూరి కుంభం సతీష్ కుమార్ గుత్తికొండ దుర్గారావు, బోలిశెట్టి చంద్రశేఖర్ ,కొత్త పద్మాకర్, పెరమల శెట్టి జానకి మోహన్ సర్ప దుర్గా సత్యనారాయణ దేవత వెంకట రవితేజ ,భవర సింగ్ రాజ పురోహిత్ బొల్లారం దేవాసి ,హేరాలాల్ పురోహిత్ ,నైరా రామ్ భాటియా అశోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

