డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: యునైటెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ రిజిస్టర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్. రామచంద్రన్, యునైటెడ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్య ,నైతిక, సాంస్కృతిక అభివృద్ధికి చేసిన కృషి ,సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి చేసిన కృషి, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం తదితల కార్యక్రమాల వివరాలు ఫోటోలు మరియు ప్రెస్ కటింగ్ లతో వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో అందజేయాలని లేదా సంబంధించిన పి.డి.ఎఫ్ ఫైల్ రూపంలో 9396861308 వాట్స్అప్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీ తేదీ లోగా అందజేయాలని తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులను సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుండి చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలకు చెందిన వారైనా అవార్డులకు అర్హులన్నారు.

