ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవం వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి కర్నూలు కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేడియం ఆవరణలో ఉన్న పద్మభూషణ్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1975 సంవత్సరం నుంచి ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ధ్యాన్ చంద్ హాకీ క్రీడకు సంబంధించి భారతదేశానికి మూడు సార్లు ఒలింపిక్ లో పథకాలు తీసుకుని వచ్చారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ వ్యక్తి ధ్యాన్ చంద్ భారతదేశంలో పుట్టడం గర్వంగా ఉందన్నారు. ధ్యాన్ చంద్ గొప్ప తనాన్ని డాక్టర్. శంకర్ శర్మ విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల కులమతాలకు అతీతంగా వారు క్రమశిక్షణతో జీవిస్తున్నారన్నారు.ధ్యానం, యోగాతో పాటు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని డాక్టర్. శంకర్ శర్మ సూచించారు క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో విజేతలకు డాక్టర్. శంకర్ శర్మ బహుమతులు అందజేశారు… ఈకార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతి రావు, క్రీడా ప్రతి నిధులు రామాంజనేయులు, సుధీర్, నాగరత్నమయ్య, గంగాధర్, పరుశ రాముడు, ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, పాపా శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, నబి సాహేబ్ తదితరులు పాల్గొన్నారు.

