దేవనూర్..సున్నం పల్లె రోడ్డు వేయండి మహాప్రభో
1 min read

వర్షం పడితే విద్యార్థులు బడికి వెళ్లడం కష్టమే..
మిడుతూరు, న్యూస్ నేడు: (నందికొట్కూరు): వర్షం పడితే చిన్నపాటి వర్షానికి రోడ్డుపై ఉన్న గుంతలల్లో నీళ్లు ఉంటూ ఉండడంతో విద్యార్థులు నడుచుకుంటూ బడికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు అదే నంద్యాల జిల్లా మిడుతూరు మండలం దేవనూరు మరియు సున్నం పల్లె రోడ్డు దుస్థితి. దేవనూరు నుండి సున్నం పల్లె గ్రామానికి కిలో మీటర్ న్నర ఉంది ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదు. విద్యార్థులు బడికి వెళ్లాలంటే కాలినడకన లేదంటే ప్రత్యేక ఆటోలకు వెళ్లాల్సిందే. ఉదయం సాయంత్రం బస్సు గ్రామానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా రోడ్డు గుంతలు గుంతలుగా ఉండటం వాటిలో నీళ్లు ఉంటుండడంతో విద్యార్థులు ప్రజలు వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదాలకు గురి అవుతున్నారని గ్రామ ప్రజలు అంటూ ఉన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

