డయేరియా వ్యాధితో బాధపడుతున్నవారికి ఓఆర్ఎస్,జింక్ మాత్రలను ఇవ్వాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉల్లిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో మహిళ ఆరోగ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో సంచార చికిత్స కార్యక్రమా జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్.రఘు పాల్గొన్నారు .అనంతరం మాట్లాడుతూచిన్నారులు ఎవరైనా డయేరియా వ్యాధితో బాధపడుతున్నప్పుడు తప్పనిసరిగా ఓఆర్ఎస్,జింక్ మాత్రలను ఇవ్వాలని సిబ్బందికి సూచించినారు. ఓఆర్ఎస్,జింక్ మాత్రల వినియోగమపై ఇంటింటా అవగాహన కల్పించాలని సూచించినారు.అతిసారావ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు తల్లిపాలు ఇస్తూ ఓఆర్ఎస్,జింక్ మాత్రలను తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు.విరేచనాలు తగ్గిన తరువాత ఓఆర్ఎస్ వినియోగించరాదని,జింక్ మాత్రలు 14 రోజుల పాటు చిన్నారులకు వేయాలని సూచించినారు.రెండు నెలల నుంచి ఆరు నెలల లోపు చిన్నారులకు చనుపాలలో మాత్రా కలిపి 10 మిల్లీ గ్రాములు (అర మాత్ర) వైద్యుల సూచనల మేరకు ,6 నెలలు దాటిన వారికి ఒక మాత్రా పరిశుభ్రమైన నీటిలో,తల్లిపాలలో కలిపి ఇచ్చినచో అతిసార వ్యాధిని నియంత్రించవచ్చునని వివరించినారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ,ఆరోగ్య కార్యకర్తలు,ఆశాకార్యకర్తలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమములో వైద్యులు డాక్టర్. ఆనందారావు ,ఆరోగ్య విస్తరణ అధికారి విజయకుమార్ .క్షేత్ర స్థాయి పర్యవేక్షకుకులు మద్దమ్మ,నాగరాజు ,ఆరోగ్య విద్య భోదకురాలు స్వర్ణగౌరి,ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

