NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ, ఎస్టీ చట్టం పై అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్  అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి. కబర్థి  సూచనల మేరకు కర్నూలు కే వి ర్ డిగ్రీ కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్  డాక్టర్ కే. వి. వెంకట రెడ్డి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కు ముఖ్య అధితిగా కర్నూలు  సిబిఐ జిల్లా జడ్జి శోభా రాణి హాజరయ్యారు.   జడ్జి మాట్లడుతూ లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం మరియు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, పి.సి.ఆర్ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్,  ర్యాగింగ్ చట్టం, పై అవగాహన  కల్పించారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు మాట్లడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమాని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. వి. రంగా రెడ్డి, కన్వీనర్ ఎస్సి/ ఎస్టీ  సెల్  డాక్టర్ ఎస్. శైలజ, తెలుగు లెక్చరర్ జయ సుశీల, కల్పన లు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author