NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఇకపై ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకం

1 min read

మరింత పటిష్టం లబ్ధిదారునికి మాత్రం సునాయాసం

ఇంటి వద్దకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ వెల్లడి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా 83695 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేశారు.  దెందులూరు మండలం దెందులూరు గ్రామంలో, పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి స్మార్ట్ కార్డులు అందించి స్మార్ట్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.  ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను సైతం మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలును పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టిందని వాటిలో భాగంగానే రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం పాత రేషన్ కార్డుల విధానాన్ని మార్చి వారికి క్యూఆర్ కోడ్ కలిగినటువంటి ప్రత్యేక స్మార్ట్ కార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతంగా, మరింత పటిష్టంగా, మరింత పారదర్శకంగా అమలు చేయడానికి సహకారం జరుగుతుందని, అదేవిధంగా ఈ కార్డు  పైనున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కార్డు లబ్ధిదారులు యొక్క పూర్తి వివరాలు,  అదేవిధంగా గతంలో నిత్యవసర సరుకులు ఏ రోజు ఎంత తీసుకున్నారు అనేటువంటి సమగ్ర వివరాలతో పాటు వారికి సంబంధించినటువంటి ఇ కేవైసి పూర్తి అయిందా లేదా అనే సమాచారం కూడా తెలుస్తుందని తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రేషన్ కార్డు లబ్ధిదారులైన 83,695 మందికి మంజూరైన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించే విధంగా స్థానిక సచివాలయ సిబ్బందికి బాధ్యతలు కేటాయించడం జరిగిందని వారితోపాటు రేషన్ షాప్ డీలర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగమై ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఈ స్మార్ట్ కార్డులను అందించే విధంగా వారికి తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఆయన వెంట సంబంధిచాక అధికారులు, కూటమి నాయకులు, నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు.

About Author