శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నకు రూ. 25 వేలు విరాళం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని ఏ. పి.ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నిమిత్తం నంద్యాల జిల్లా వెలుగోడు మండలం,వెల్పనూరు గ్రామం నకు చెందిన కీ. శే.కొల్లి తిరుపాల్ కుమారుడు శ్రీ కొల్లి శివ రూ. 25,000 నగదును మంగళవారం విరాళంగా కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి రంగస్వామి ,పాల సుంకన్న వెంకటేశ్వర్లు ధనుంజయ కె.కిష్టన్న కె సి నాగన్న కోత్తపల్లి దేవేంద్ర తవుడు శ్రీనివాసులు తిరుపాల్ దివాకర్ ఎల్లయ్య పుల్లన్న కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి గుడిసె శివన్న మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ మరియు విద్యార్థుల హాస్టల్ నిర్మాణమునకు దాతలు ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వాలని పిలుపునిచ్చారు.


