NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం

1 min read

చిగిలి గ్రామంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ తెర్నేకల్ వెంకప్ప ఆర్థిక సాయం

ఆలూరు న్యూస్ నేడు : గత నెల 20వ తేదీన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి చెందిన ఆరుగురు చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లి మృతిచెందిన విషాద ఘటనలో,  ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున, 6 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అరవింద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ కురువకురుమ కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు పూజారి శ్రీనివాసులు, శివ, సోమశేఖర్, వీరేంద్ర, రాఘవేంద్ర, విశ్వనాథ్, అలీ, సురేంద్ర, అంజి కుమార్, ప్రసాద్, వీరేష్, తిక్కయ్య, వెంకటేష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

About Author