‘ ఓమేగా’లో మహిళా టీచర్లకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష
1 min read

కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఓమేగా హాస్పిటల్ సీఓఓ డా. గణేష్ తెలిపారు. విద్యార్థులకు పాఠాలు బోధించి.. వారి భవిష్యత్ ను తీర్చిదిద్దుడంలో మహిళా టీచర్లు, లెక్చరర్ల పాత్ర కీలకమని, వారి సేవలను గుర్తించి ఓమేగా హాస్పిటల్ లో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత బ్రెస్ట్ స్క్రీనింగ్ ( క్యాన్సర్ నిర్ధారణ ) మమో గ్రాఫీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 40 సంవత్సరాలు పై బడిన మహిళా టీచర్లు మరియు లెక్చరర్లుకు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఇందుకు వారి ఆధార్ కార్డు లేదా స్కూల్ , కాలేజి ఐడీ కార్డు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ శ్యాముల్ పాల్ కు, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా వినతిపత్రం అందజేసినట్లు ఓమేగా హాస్పిటల్ సీఓఓ డా. గణేష్ వివరించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా టీచర్లు, లెక్చరర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కర్నూలు మరియు నంద్యాల జిల్లాల విద్యాశాఖాధికారులకు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఓమేగా హాస్పిటల్ మార్కెటింగ్ శాఖ మేనేజర్ రంజిత్ ఉన్నారు.


