NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ ఓమేగా’లో  మహిళా టీచర్లకు ఉచిత క్యాన్సర్​ నిర్ధారణ పరీక్ష

1 min read

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు:  ఉపాధ్యాయ దినోత్సవం  పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు ఉచిత క్యాన్సర్​ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఓమేగా హాస్పిటల్ సీఓఓ డా. గణేష్​ తెలిపారు.  విద్యార్థులకు పాఠాలు బోధించి.. వారి భవిష్యత్​ ను తీర్చిదిద్దుడంలో మహిళా టీచర్లు, లెక్చరర్ల పాత్ర కీలకమని, వారి సేవలను గుర్తించి ఓమేగా హాస్పిటల్​ లో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత బ్రెస్ట్​ స్క్రీనింగ్​ ( క్యాన్సర్​ నిర్ధారణ ) మమో గ్రాఫీ నిర్వహిస్తున్నట్లు   ఆయన పేర్కొన్నారు.  40 సంవత్సరాలు పై బడిన మహిళా టీచర్లు మరియు లెక్చరర్లుకు శుక్రవారం  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని,  ఇందుకు వారి ఆధార్​ కార్డు  లేదా స్కూల్​ , కాలేజి ఐడీ కార్డు తీసుకురావాలని కోరారు.  ఈ మేరకు గురువారం డీఈఓ శ్యాముల్​ పాల్ కు, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా వినతిపత్రం అందజేసినట్లు ఓమేగా హాస్పిటల్​ సీఓఓ డా. గణేష్​ వివరించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా టీచర్లు, లెక్చరర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  కర్నూలు మరియు నంద్యాల జిల్లాల విద్యాశాఖాధికారులకు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఓమేగా హాస్పిటల్​ మార్కెటింగ్​ శాఖ మేనేజర్​ రంజిత్​ ఉన్నారు.

About Author