వినాయక నిమజ్జనోత్సవంలో..వైసీపీ సేవ..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు :మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కర్నూలులో వినాయక నిమజ్జనోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ భక్తులకు తాగునీరు అందించి.. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హఫీజ్ ఖాన్ నేతృత్వంలో గత 14 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ, ప్రేమ, స్నేహం, సౌహార్ధతతో అన్ని పండుగలను కలిసి జరుపుకోవాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురువారం నిమజ్జనోత్సవం సందర్భంగా కింగ్ మార్కెట్ , బుధవారం పేట్ వద్ద భక్తులకు అన్నదానం కార్యక్రమం చేశారు. భవిష్యత్ లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్న హఫీజ్ ఖాన్… కర్నూలు నగరంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడేందుకు కృషి చేస్తామన్నారు.


