నేడు”అన్నదాత పోరు”కు తరలిరండి..
1 min read

జడ్పిటీసీ మరియు మండల కన్వీనర్..
మిడుతూరు, న్యూస్ నేడు: రైతులకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రైతుల సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు 9వ తేదీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమం ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిడుతూరు జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి,మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరులో లోకేశ్వర్ రెడ్డి స్వగృహంలో సాయంత్రం లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారని రైతులకు యూరియా వెంటనే పంపిణీ చేయాలని పంటలకు గిట్టుబాటు ధర,ఎరువులను పక్క దోవా పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ ఆత్మకూరులో ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, ఎంపిటీసీ హరి సర్వోత్తమ్ రెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి,నాగ తులసి రెడ్డి,నారాయణ రెడ్డి, చిన్న రామచంద్రా రెడ్డి, షరీఫ్,మల్లేశ్వర రెడ్డి,రవి, రామలింగా రెడ్డి,పుల్లయ్య పాల్గొన్నారు.

