NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

1 min read

సమాజంలో ప్రతి ఒక్కరు అక్షరాసులుగా ఎదిగిన రోజున దేశం అభివృద్ధి చెందుతుంది

ఎంపీడీవో వి.శ్రీలత

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవo

జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం

చదువు మనిషి ఎదుగుదలకు దోహదపడుతుంది

ఉప సంచాలకులు జి.సిహెచ్ ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏలూరు ఎంపీడీవో కార్యాలయము నందు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో డిఆర్డిఏ మరియు ఎం ఈ పి ఎం ఏ సిబ్బంది పాల్గొనడం జరిగినది. ఈ సమావేశం లో ఏలూరు ఎంపీడీవో వి.శ్రీలత  మాట్లాడుతూ విద్య నేర్చుకోవలసిన ఆవశ్యకత అందరికీ వుందని, సమాజంలో ప్రతి ఒక్కరు  అక్షరాసులుగా ఎదిగిన రోజున ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పేర్కొన్నారు.ఏలూరు జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు  జి.సిహెచ్ ప్రభాకర్  మాట్లాడుతూ చదువు మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుందని, చదువు అన్ని వర్గాల మరియు అందరి ప్రగతికి దోహద పడుతుందని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వము  ఆదేశానుసారం జిల్లా అంతటా నిర్వహించ బడుతున్న “అక్షర ఆంధ్ర” కార్యక్రమము లో నిరక్షరాస్యులందరూ చదువు కొని అక్షరాస్యులుగా మారాలన్నారు.వయోజన విద్యా శాఖ కార్యాలయము నందు ఏ పీ ఓ గా పని చేయుచున్న ఆర్. విజయ కుమార్  మాట్లాడుతూ చదువు సమాజాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందనియని, వారి జీవితాలలో వెలుగును నింపుతుందనియ గుర్తు చేశారు. రాబోయే  ప్రజలలో అవగాహన ఏర్పరచు నిమిత్తం ఆర్ డి ఏ మరియు ఎం ఈ పి ఎం ఏ సిబ్బంది తో కలిసి ఎంపీడీవో కార్యాలయము నుండి ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు ఏలూరు డిఆర్డిఏ ఏపీఎం టి. నాగేశ్వర రావు, ఎంఈపిఎంఏ,సిఎంఎం బి.ఝాన్సీ రాణి  మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

About Author