పార్టీ ఉనికి కోసమే వైసీపీ డ్రామాలు
1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్
అసత్య ప్రచారాలతో వైసిపి పార్టీ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల అరాచకాలకు విసిగిపోయిన ఏపీ ప్రజలు ఆ పార్టీని ఘోరంగా ఓడించారని ఎంపి పుట్టా మహేష్ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ పుట్ట ను మీడియా ప్రతినిధులు కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసి రెండేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనలు గుర్తు చేసినప్పుడు స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చంద్రబాబు వంటి ఒక సీనియర్, విజనరీ లీడర్ ను, వైసీపీ పెద్దలు కేవలం వాళ్ళ ఆనందం కోసం తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఎంతో బాధపడ్డామన్నారు. నాడు వైసీపీ పార్టీ చేసిన అరాచకాలకి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని, అయినప్పటికీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం లేని సమస్యలను సృష్టిస్తూ అన్నదాత పోరు పేరుతో ఆందోళనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, కావలసినంత యూరియాను కేంద్రం సరఫరా చేస్తోందని, రైతులు వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మరని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ఇటీవల తమ కృషి ఫలించి పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కంటే అధికంగా లభిస్తోందని, అదనపు కొనుగోళ్లకు అనుమతులు వచ్చి పొగాకు రైతులు కూడా ఆనందంగా ఉన్నారనన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిశ్రమలు, ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళుతుంటే చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు కేవలం తమ ఉనికి చాటుకోవడానికి అసత్య ప్రచారాలతో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విమర్శించారు.

