గురువులే సమాజానికి మార్గదర్శకులు ,స్ఫూర్తి ప్రదాతలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ భవనంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల కళాశాలలో సేవలందిస్తున్న వారికి ఉత్తమ సేవా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న లయన్ మాజీ జిల్లా గవర్నర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు .కెవి సుబ్బారెడ్డి కళాశాల అధినేత డాక్టర్ కె.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యా, సమాజం ,దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లయన్ ఐ. విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో శ్రేష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు. తాటిపాడు మహబూబ్ సాహెబ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యతో పాటు విద్యార్థులకు జీవన విలువలను నేర్పించాలన్నారు.స్పెషల్ పోలీస్ డిఎస్పి మహబూబ్ బాషా మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమని ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన జీవన విధానం నేటి విద్యార్థినీ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ ,యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ సైట్స్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ లయన్స్ మాజీ జిల్లా ఎడిషన్ క్యాబినెట్ సెక్రెటరీ నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశలో గురువులు ఇచ్చే మార్గదర్శకాలే సమాజానికి దిశ నిర్దేశం చేస్తాయన్నారు. కార్యక్రమంలో 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మురారి శంకరప్ప ,డాక్టర్ జయప్రకాష్, లయన్ టి .గోపీనాథ్ ,డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ బాలేశ్వరయ్య ,డాక్టర్ రంగనాయక్, బాలసుబ్రమణ్యం ,ఎలమర్తి రమణయ్య, రాఘవేంద్ర ప్రసాద్, మురళీకృష్ణ, రాయపాటి నాగలక్ష్మి, నాగ స్వామి నాయక్ ,ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు టి .వెంకట్ రెడ్డి ,డాక్టర్ అన్వర్ హుస్సేన్, డాక్టర్ ఫమీద, డాక్టర్ బి పరిమళాదేవి, డి. ఈశ్వరయ్య, పూజారి వెంకటరమణయ్య, జి అబ్దుల్ కలీం, డాక్టర్ రామసుబ్బారెడ్డి, ఎం .కాజాబేగ్, కే డీజే బాబు, కవితా దేవి, ఎస్ ఫర్జానా, కే భారతి, వై.వి రామకృష్ణ, కే. చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

