డబ్ల్యూటిఐటిసి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బూర వెంకటేశ్వర్లు నియామకం
1 min read

సెప్టెంబర్ 27న ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, న్యూస్ నేడు : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటిఐటిసి) చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల ఆధ్వర్యంలో, స్ప్రైపిల్ ఫౌండర్ & సీఈఓ బూరా వెంకటేశ్వర్లూ (వెంకట్)ను డబ్ల్యూటిఐటిసి తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించినట్లు గర్వంగా ప్రకటించింది. ఈ నియామకానికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం 2025 సెప్టెంబర్ 27న జరగనుంది. ఇది డబ్ల్యూటిఐటిసి నాయకత్వ విస్తరణలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.బూర వెంకట్ కు గ్లోబల్ ఐటీ రంగంలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. టీసీఎస్, యాక్సెంచర్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, నార్త్ అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో జ్యూరిచ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎరిక్సన్ వంటి ఫార్చ్యూన్ 500 సంస్థలకు పెద్ద ఎత్తున టెక్నాలజీ సొల్యూషన్లు అందించారు. సీరియల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన సనెలా హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్, శ్రీబ్ టెక్నాలజీస్‌ను స్థాపించి, ఐఎస్ఆర్ఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు పరిష్కారాలను అందించారు. సెప్టెంబర్ 27, 2025న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం ద్వారా డబ్ల్యూటిఐటిసిలో ఆయన కొత్త బాధ్యతలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నియామకంతో డబ్ల్యూటిఐటిసి తన మిషన్‌ను గ్లోబల్ లీడర్‌షిప్ విస్తరణ, ఇన్నోవేషన్ ప్రోత్సాహం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్‌కు బలమైన వేదికల నిర్మాణం మరింత ముందుకు తీసుకెళ్తోంది.

