NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉమ్మడి జిల్లాల యన్ జి ఓ ల కు సెన్సిటైజషన్ ప్రోగ్రాం 

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్  అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి. కబర్థి  సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి మంగళవారం నాడు కర్నూలు న్యాయ సేవా సదన్  నందు   ఉమ్మడి జిల్లాల యన్ జి ఓ లకు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిజబులిటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లకు సెన్సిటైజషన్ ప్రోగ్రాం నిర్వహించారు. మహిళలు,పిల్లలు, సీనియర్ సిటిజన్స్, అక్రమ రవాణా బాధితులు, ట్రాంజెండర్స్, గిరిజనలు, అసంఘటిత కార్మికులు మొదలైన వారి ప్రయోజనాల కోసం పనిచేసే ఎన్జీవోలను మరియు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లను ఒకే గొడుగు కిందకు తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రాంను లీగల్ సర్వీసెస్ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్జీవోలు నిజమైన పేదవారికి మరియు సంబంధిత శాఖకు మధ్య అనుసంధానకర్తగా పనిచేయాలని కోరారు.న్యాయ సేవల సంఘము మరియు ఎన్జీవోల సమిష్టి ప్రయత్నంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హత ఉన్న పేదవారికి చేరవేసి ప్రయోజనం కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు.  సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ రైస్ ఫాతిమా మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్ ద్వారా సీనియర్ సిటిజనులకు, ట్రాంజెండర్లకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.   నంద్యాల  డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  జనార్దన్ రెడ్డి  మాట్లాడుతూ  పేద పిల్లలను గుర్తించి వారిని స్కూళ్లలో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల మండల విద్యాశాఖ అధికారులు మరియు కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, సమర్థవంతంగా పనిచేసే నేస్తం ఎన్జీవో సుధారాణి, సిఎంఎస్ ఎన్జీవో అంబికా శిశు కేంద్రం వారు, డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు ఎన్జీవో బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక, ప్రతిభా ఎడ్యుకేషనల్ సొసైటీ నారాయణ, లిటిల్ ఫ్లవర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, నవజీవన్ ఎడ్యుకేషనల్ సొసైటీ యాక్సిస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ఎన్జీవో రామాంజనేయులు, విజయ మహిళా మండలి ఎన్జీవో విజయ, యన్ సీఎల్పి ఎన్జీవో ఎడ్వర్డ్ & సుబ్బరాయుడు  తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నరు.

About Author