అమీలియోకు ‘ ఎన్ఏబీఎచ్ ‘ గుర్తింపు
1 min read

ప్రమాణ పత్రం అందుకున్న ఆసుపత్రి ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ చాపే
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న అమిలియో హాస్పిటల్ ఎన్ఏబీహెచ్ జాబితాలో చేరినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎన్ఏబీహెచ్ ప్రమాణ పత్రం అందుకున్న సందర్భంగా బుధవారం బళ్లారి రోడ్డులోని హాస్పటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలోకేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ చెపే మాట్లాడుతూ ఆసుపత్రి ఆరోగ్య సేవలలో విశిష్టతను సాధిస్తూ, NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) ప్రమాణపత్రం అందుకుందన్నామన్నారు. NABH గుర్తింపు ద్వారాఆసుపత్రి సేవా ప్రమాణాలు మరింతగా మెరుగవుతాయన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే మా ప్రధాన లక్ష్యమన్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ విశిష్టతను సాధించడం మా వైద్య బృందం యొక్క కృషి అన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కన్సల్టెంట్లు వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

