NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకురావడానికి ఏర్పాట్లు

1 min read

అమరావతి , న్యూస్​ నేడు:  నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్న మంత్రి లోకేష్కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లోని ఏపీ భవన్, రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న మంత్రిసమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులునేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయానికి సమీపంలోనే 165 మంది తెలుగువారు ఉన్నారని తెలిపిన అధికారులు.సిమిల్ కోట్ సమీపంలో మరో 12 మంది తలదాచుకున్నారని వివరించిన అధికారులు.పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ దేశానికి తీసుకురావడంపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి లోకేష్.ఇందుకు కావాల్సిన అనుమతులను వివరించిన అధికారులు, కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి లోకేష్.బాధితులతో ప్రతి రెండు గంటలకోసారి ఫోన్ లో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్న మంత్రి లోకేష్ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాకబు చేసిన మంత్రి.సురక్షితంగానే ఉన్నామని, అక్కడ ఉన్న పరిస్థితులను లోకేష్ కు వివరించిన నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు.ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలుగువారికి సూచించిన మంత్రి లోకేష్.రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాధితులకు భరోసా ఇస్తున్న మంత్రి లోకేష్.

About Author