ఆరు రోజుల నాయకత్వ శిక్షణా కార్యక్రమం రెండవ బ్యాచ్ ముగింపు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నాయకత్వ లక్షణాల పెంపుపై మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం రాఘవేంద్ర బిఈడి కళాశాల నన్నూరు గ్రామంలో టోల్గేట్ నంద్యాల రోడ్డు నందు విజయవంతముగా ముగిసినది కర్నూలు, కడప నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు ఆరు రోజుల నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణా కార్యక్రమం సైకిల్ టు రెండవ బ్యాచ్ మొదటి రోజు శిక్షణా కార్యక్రమాన్ని గౌరవ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. శామ్యూల్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆర్జెడి ప్రసంగిస్తూ కర్నూలులో తాను పనిచేసిన అనుభవాలను గుర్తుకు చేసుకుంది ఇదే సందర్భంలో పరీక్షల ఆవశ్యకతను నిర్వహించాల్సిన విధివిధానాలను తెలియజేసిరి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పాటు పడాలని తెలియజేసిరి కర్నూల్ డిఈఓ శామ్యూల్ పాల్ ఇక్కడ ఏర్పాటు చేసిన అన్ని ఏర్పాట్లను పరిశీలించిరి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయుల మరియు మండల విద్యాధికారుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న వాటిని ప్రత్యేకంగా పరిశీలించి తగిన సూచనలను సలహాలను అందజేసిరి ఇదే సందర్భంలో విద్యార్థులను భావి భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దాలని వారి అభివృద్ధికి అందరి తోడ్పాటు అవసరమని తెలియజేసిరి ఈ శిక్షణా కార్యక్రమంలో కల్లూరు మండల విద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ శిక్షణ తో ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు చాలా మేలు జరుగుతుందని తెలియజేసిరి ఈ శిక్షణా కార్యక్రమంలో నంద్యాల పూర్వ విద్యాధికారి మరియు ప్రస్తుత డోన్ ఉపవిద్యాధికారి అయినా శ్రీ కె.సుధాకర్ రెడ్డి సార్ పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించిరి, ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమంలో ఆర్పిల పర్యవేక్షణలో సారు చక్కగా నిర్వహించిరి ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తించి యోగా గురువు నారాయణరెడ్డి సార్ చేత యోగాసనుములు మరియు ధ్యానం ప్రాముఖ్యతను వచ్చిన అందరికీ తెలియజేసిన ఈ కార్యక్రమం చివరి రోజున పి జనార్దన్ రెడ్డి నంద్యాల డీఈవో సందర్శించి తనతో పాటు చదువుకున్న మిత్రులను శిష్యులను చూచి సంతోషించిరి తనకు ఈ అవకాశం కల్పించిన కమిషనర్ కి, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిరి అదేవిధంగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులకు మనబడి నాడు నేడు ఆవశ్యకతను తెలియజేసి ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులు ప్రవర్తించవలసిన తీరుతెన్నులను ఉదాహరణలతో వివరించిన మరియు పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులతో చర్చించి మంచి విషయంలను అందజేసి కార్యక్రమం యొక్క లక్ష్యాలను మరియు ఆశయాలను అమలుపరిచే బాధ్యతను సమన్వయం చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరిరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాస్టర్ ఫెసిలిటేటర్స్ విశేషంగా కృషిచేసిరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యపాత్ర వహించిన అందరూ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు సమగ్ర శిక్ష కర్నూలు సహాయ విద్యా పరిశీలన అధికారి డాక్టర్ రఫీ కృతజ్ఞతలు తెలియజేశారు.