ఆపరేషన్ ట్రేస్ విజయం..
1 min read

మూడేళ్ల క్రితం పారిపోయిన 11 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత
ఎఎస్ పి, డిఎస్ పి,సిఐ కి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : హైదరాబాద్ కు చెందిన 11 ఏళ్ల బాలుడు మూడేళ్ల క్రితం ఇంటి నుండి పారిపోయి గుంటూరు రైల్వే స్టేషన్ లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు దొరికాడు.వారు బాలుడిని ఏలూరు శనివారపు పేట బాలుర వసతిగృహం అధికారులకు అప్పగించారు. అప్పటినుండి శనివారపు పేట హోమ్ లో అతను ఆశ్రయం పొందుతూ ఉంటున్నాడు. ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా బాలుడు ఇబ్రహీం ను అతని తల్లిదండ్రులైన అక్రమ్,ఆశ బేగంలకు,ఏఎస్ పి నక్క సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్, సిఐ సుబ్బారావు ల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అప్పగించారు. బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

