ప్రజాక్షేత్రంలో మరోసారి రుజువైన చింతమనేని నిర్దోషత్వం
1 min read

ఏలూరులో జిల్లా కోర్టు సంచలన తీర్పు
న్యాయస్థానం తీర్పుతో ప్రజలు ఆనందం వ్యక్తం
న్యాయవాదులు నెరుసు మురళీ గంగాధర్, వీరమాచినేని ప్రభాకర్ ని అభినందించిన చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : చింతమనేనిపై జరిగే కేసులు అన్ని తప్పుడు కేసులే అంటూ మరోసారి నేడు రుజువైంది అంటున్న టిడిపి నాయకులు – నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఉండే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గత వైసిపి ప్రభుత్వంలో సైతం రాజకీయ కుట్రలతో పెట్టిన ఎన్నో తప్పుడు కేసులు పెట్టిన ప్రత్యర్థులు నోటికి తాళం బిగిసింది. అయితే దీన్ని అదునుగా తీసుకున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్,ఆయన అనుచరులు దౌర్జన్యానికి దాడికి పాల్పడ్డారంటూ,ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారంటూ అనేక రకాలుగా వారిపై తప్పుడు కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుపై గతంలో భీమడోలులోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన విచారణలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పుని ఇవ్వగా మిగతా వారిపై కేసును కొట్టివేసిందిఅయితే తనకు విధించిన శిక్ష సహేతుకం కాదంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరులోని జిల్లా కోర్టులో అప్పీల్ కు వెళ్లారు. దీంతో చింతమనేని ప్రభాకర్ అప్పీల్ ను స్వీకరించిన ఏలూరులోని జిల్లా ఒకటవ అదనపు మరియు సెషన్స్ న్యాయస్థానం కేసును పూర్వపరాలు మొత్తం విచారించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జరిగిన ఆరోపణలు వాస్తవం కాదని వారికి విధించబడిన శిక్ష సహేతుకం కాదని, అందుకే భీమడోలు కోర్టు విధించిన శిక్షణ రద్దు చేస్తున్నామనీ తెలుపుతూ ఈరోజు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. చింతమనేని ప్రభాకర్ ఈ కేసులో నిర్దోషి అంటూ కోర్టు తీర్పును వెల్లడించింది.ఈ సందర్భంగా కేసులో సమర్ధవంతంగా వాదనలు వినిపించి న్యాయాన్ని గెలిపించటంలో కృషి చేసిన సీనియర్ న్యాయవాది నెరుసు మురళి గంగాధర్ ని, న్యాయవాది వీరమాచినేని ప్రభాకర్ ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా కేసు వివరాలను ప్రముఖ న్యాయవాది నెరుసు.మురళీ గంగాధర్ మీడియాకు వివరించారు.దీంతో రాజకీయంగా తమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ప్రత్యర్థులు ఈ విధంగా ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని, వాటిలో ఎన్నో ఇప్పటికే న్యాయస్థానాలు కొట్టివేశాయని,మిగతా కేసులులో కూడా న్యాయమే గెలుస్తుందని, తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, ప్రత్యర్థులు పెట్టిన ప్రతి తప్పుడు కేసు వీగిపోయి చింతమనేని ప్రభాకర్ నిర్దోషిత్వం మరోసారి ఈరోజు రుజువడం ఎంతో ఆనందదాయకంగా ఉందని దెందులూరు నియోజకవర్గం టిడిపి నాయకులు,జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి యిప్పిలి వెంకటేశ్వరరావు (వైవిఆర్) తెలిపారు.


