మణిపూర్ ఘటనలో మృతి చెందిన గిరిజన క్రైస్తవులను ఆదుకోవాలి..
1 min read

కోటి రూపాయలు నష్ట పరిహారం అందించాలి
శిబిరాల్లో పునరావసం జీవనం సాగిస్తున్న వారికి రక్షణ కల్పించాలి
నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మణుపూర్ పర్యటన శుభపపర్ణమని స్వాగతిస్తున్నామనిన్నారు. గత రెండు సంవత్సరాలుగా మణిపూర్ అట్టడుగుతున్న వెయ్యి మందికి పైగా మణిపూర్ కాల్పుల ఘటన లో చనిపోయినప్పటికీ కూడా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టినప్పటికీ కూడా అనేకమంది పై కుక్కిస్ మైటీస్ లపై దాడులు చేసి చంపడం అన్నది దుర్మార్గపు చర్య అన్నారు. మణుపూర్ లో చనిపోయిన గిరిజన క్రైస్తవులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్ట పరిహారం మోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పునరావస్థత్వం కల్పించాలని, ఇంకా మణిపూర్ లో శిబిరాల్లో పునరావసం జీవనాన్ని సాగిస్తున్న మణిపూర్ లోని కుకీస్ మరియు మైటీస్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని అన్నారు. మణిపూర్లో శాంతిభద్రతలు కల్పించాలని మణిపూర్ లో వేలమంది నిరాశ్రయుల అయిపోయారని వారందరికీ ఉపాధి కల్పించాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీని సవినయంగా కోరుతున్నామన్నారు. నేపాల్ సంఘటన తర్వాత నరేంద్ర మోడీ లో మార్పు వచ్చిందని దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

