టమోటా కు గిట్టుబాటు ధర కల్పించాలి
1 min read

సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్
పత్తికొండ, న్యూస్ నేడు: టమోటా పంటకు గిట్టుబాటు ధర కనీసం కిలో 10 రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమోటా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని కోరుతూ, సోమవారం సిపిఎం ప్రతినిధి బృందం పత్తికొండ టమోటా మార్కెట్ లో పర్యటించింది.ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాధాకృష్ణ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరశేఖర్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి రైతులను కలిసి టమోటా పంట గిట్టుబాటు ధరల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, మార్కెట్లో ప్రస్తుతం టమోటా ధర మూడు రూపాయల నుండి 6 రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతుందని, దీని వల్ల టమోటా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులు టమోటా పంటను తెంపి, మార్కెట్కు తరలించేందుకు రవాణా చార్జీలు, ఖర్చులకు కూడా సరిపోవడంలేదని తెలిపారు. టమోటాను మార్కెట్కు తీసుకురావడానికి ఒక గంప కు 10 నుండి 15 రూపాయలు ఖర్చు వస్తుందని, అదేవిధంగా పెట్టుబడి 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించారు. నేడు మార్కెట్లో రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కాబట్టి టమోటాను కిలో పది రూపాయలు ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అయన డిమాండ్ చేశాడు. అలా కానీ ఎడల టమోటా రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సిద్ధయ్య గౌడ్, సురేంద్ర, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.


