ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆలూరు ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో ప్రభుత్వ అస్పత్రిని తనిఖీ చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడుతూ….టీడీపీ ప్రభుత్వం 2015లో స్టార్ట్ చేస్తే 2018 లో ఆస్పత్రి ని ప్రారంభించారు.ఆస్పత్రి భవనం నిర్మించిన 6 సంవత్సరాలకే ఇలా అవడం చాలా దురదృష్టకరమన్నారు.ప్రభుత్వ డాక్టర్ ఆస్పత్రి భవనంలో ఒక రూమ్ ను పరిశీలించిన 2 నిమిషాలలో భవనంపై భాగo పెచ్చులు ఊడి పడినాయి. కమ్మరచేడు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఇక్కడ వైద్యం చేపించుకోవాలన్నా భయమేస్తుంది అని అన్నారు. డాక్టర్స్ మరియు నర్సులు బిక్కు బిక్కు మంటూ వైద్యం అందిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం, ప్రజాల ప్రాణాలు అంటే లెక్క లేదన్నారు.ఆర్సిపి పార్టీ అధికారం ఉన్నప్పుడు సచివాలయాలు ఎంత బాగా కట్టించారో చూడండి ఒకసారి అని అన్నారు డిఎంహెచ్ఓ ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రికి వచ్చి చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి , మల్లికార్జున రెడ్డి , శ్రీధర్ రెడ్డి , సర్పంచ్ అనిల్ కుమార్ రెడ్డి , వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


